కాలా.. యూఎస్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ |
Rajinikanth Kaala USA Premier Collections
Rajinikanth Kaala USA Premier Collections
తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన చిత్రం “కాలా”.ఈ చిత్రం గురువారం ఘనంగా విడుదలైన సంగతి తెలిసిందే. మురికి వాడల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ లభించింది.
రోబో సినిమా నుంచి చాలా బాషల్లో తలైవా సినిమాలకు బిజినెస్ భారీగా పెరిగిపోయింది. కోలీవుడ్ జనాలతో పాటు టాలీవుడ్ జనాలు కూడా రజినీకాంత్ సినిమా కోసం చాలా ఆతృతగా ఎదురుచేస్తారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా రజినీకాంత్ సినిమాలకు చాల మంచి మార్కెట్ ఉందని తెలిసిందే. అయితే రజినీ రీసెంట్ ఫిల్మ్ కాల మాత్రం ఊహించని ఓపెనింగ్స్ అందుకుంది.
యూఎస్ లో రజినీకాంత్ ఫాలోవర్స్ బాగా ఎక్కువగా ఉన్నారు. దాదాపు గా ఎన్నారైలు మొత్తం సూపర్ స్టార్ కు అభిమానులే కానీ కాలా సినిమా మాత్రం డాలర్స్ ను అనుకున్నంత రేంజ్ లో ఓపెనింగ్ డే రాబట్టలేకపోయింది. గురువారం ప్రీమియర్స్ ను ప్రదర్శించగా సినిమా అన్ని భాషల్లో కలిపి $600k వసూలు చేసింది. ఈ స్థాయిలో కలెక్షన్స్ వస్తాయని ఎవరు ఊహించలేదు. ఎందుకంటే కబాలి ఓపెనింగ్ కి చాలా స్ట్రాంగ్ గా వచ్చాయి. కబాలి ప్రీమియర్స్ కు 1.95 మిలియన్ డాలర్లు అందుకొని రికార్డ్ సృష్టించింది. కానీ కాలా అందులో సగానికి కూడా రాబట్టకపోవడం గమనార్హం.
ఇంతటి బ్యాడ్ ఓపెనింగ్స్ కు కారణం లేకపోలేదు. దర్శకుడు పా.రంజిత్ కబాలి సినిమాను డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఎంతో హైప్ క్రియేట్ చేసినా.. ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో ఈ కాంబినేషన్ పై జనాలు పెద్దగా ఆశలు పెట్టుకోలేదు, ట్రైలర్ టీజర్స్ సాంగ్స్ కూడా ప్రమోషన్స్ కి ఉపయోగపడలేదు.