గుండు హనుమంతరావు ఇక లేరు శోకంలో టాలీవుడ్ | Comedian gundu hanumantha rao passed away | family | son

136

గుండు హనుమంతరావు ఇక లేరు శోకంలో టాలీవుడ్ | Comedian gundu hanumantha rao passed away | family | son

ప్రముఖ సినీ హాస్యనటుడు గుండు హనుమంతరావు కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఎస్సార్‌నగర్‌లోని స్వగృహంలో తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో అనారోగ్యానికి గురైన ఆయన్ని కుటుంబసభ్యులు ఎర్రగడ్డలోని సెయింట్‌ థెరిసా ఆస్పత్రికి తరలించారు. ఆయన్ని పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. ఆయన సుమారు 400లకు పైగా సినిమాల్లో నటించారు.
కడుపుబ్బా నవ్విస్తారు.. కాని వారి జీవితాలేమో అంతులేని విషాదంలా ఉంటాయి. ఎందరో కమెడియన్ల నిజ జీవితాలు దుర్భర దారిద్ర్యంతోనే ఉంటాయి. ఆ మాటకొస్తే తెరమీద మహా నటీ నటులుగా చెలామణి అయిన ఎందరో తారలు నిజ జీవితంలో ఒక్కపూట తిండి పెట్టే వారి కోసం ఎదురు చూశారు. అదేదో వారికి సినిమా అవకాశాలు రాకముందు జరిగిన ఘటనలు అనుకుంటే పొరపాటే. దశాబ్దాల తరబడి వారి స్టార్ డమ్ కొనసాగిన తర్వాత వారు ఎదుర్కొన్నా ధీనావస్థలు. ఉద్దండ నటీ నటులైన ఎస్.వి.రంగారావు, సావిత్రి, కాంతారావు, రాజబాబు, సూర్యాకాంతం.. ఇలా అందరూ జీవిత చరమాంకంలో డబ్బులకు కటకట ఎదుర్కొన్నవారే. కెరీర్ పరంగా మహర్దశ నడుస్తున్న కాలంలో ఫైనాన్షియల్ ప్లానింగ్ లేక దెబ్బతిన్నవారే.. ఇప్పుడు వారి కోవలోనే గుండు హనుమంతరావు కూడా ఉన్నారన్న సంచలన విషయం తాజాగా బయటికొచ్చింది.
ఆయన చాలా చాలా పేదరికాన్ని అనుభవిస్తూ కూడా ఎవరికీ చెప్పుకోలేదు.ఇటీవల అలీతో నిర్వహించిన షోలో గుండు హనుమంతరావు తన ధీన గాధను వివరించారు. పాతికేళ్లకుపైగా తన కెరీర్ లో సంపాదించిన కోట్లు కరిగిపోయిన వైనాన్ని వివరించి కన్నీళ్లు పెట్టుకున్నాడు. భార్యా బిడ్డ చనిపోయాక తాను ఎంతలా కుంగిపోయానో వివరించారు. ఇటీవల వరకు అమృతం సీరియల్లో అంజి క్యారెక్టర్లో కూడా అలరించిన ఆయన నిజ జీవితపు విషాదాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు. వరుస దుర్ఘటనలతో మానసికంగా కుంగిపోవడమే కాదు కిడ్నీలు సైతం దెబ్బతిన్న రహస్యాన్ని హనుమంతురావు వెల్లడించారు.

అప్పటికే సంపాదించిందంతా కొడుకు విదేశాల్లో చదువుకి వినియోగించినట్లు తెలిపారు. ఇంతలో హనుమంతరావు ఆరోగ్యం దెబ్బతినడం తో వైద్యం చేయించేందుకు డబ్బులు సైతం లేకుండాపోయాయన్నారు. కనీసం ఆసుపత్రిలో తనతో ఎవరు లేక ఒంటరిగా ఉన్న క్రమంలో కొడుకు విదేశాల్లో చేస్తున్న ఉద్యోగాన్ని మానుకుని వచ్చినట్లుగా వివరించారు. వచ్చి తండ్రి దగ్గరే ఉంటున్నాడు. అయితే ఇప్పుడు ఇద్దరికీ మెయింటెనెన్స్ ఇబ్బందిగా మారింది. కిడ్నీ వ్యాధుల గురించి కాని, చేతిలో డబ్బులేని విషయం కాని ఎవ్వరికీ చెప్పుకోలేదన్నారు. కానీ అందరు కోలుకున్నారు అనుకునే లోపు ఇంతటి విషాదం చోటు చేసుకుంది .

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తన స్వగృహంతో తుదిశ్వాస విడిచారు. 1956 అక్టోబర్ 10న విజయవాడలో ఆయన జన్మించారు. నాలుగు వందలకు పైగా సినిమాల్లో గుండు హనుమంతరావు నటించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఆయన మాట్లాడుతూ తాను కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నానని తెలిపారు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నప్పటికీ తన అనారోగ్య విషయాన్ని ఎవరికీ తెలియజేయలేదన్నారు. దీంతో విషయం తెలుసుకున్న చిరంజీవి ఆయనకు ఆర్థిక సాయం అందించారు.
18ఏళ్ల వయసులో గుండు హనుమంతరావు నాటకరంగ ప్రవేశం చేశారు. నాటకాల్లో ఆయన వేసిన మొదటి వేషం రావణబ్రహ్మ. స్టేజీ షోలతో ఆయన చాలా పాపులర్‌ అయ్యారు. 400 సినిమాల్లో నటించిన గుండు హనుమంతరావు తొలి చిత్రం అహ నా పెళ్లంట. ఆయనకు బాగా పేరు తెచ్చిన సీరియల్ అమృతం. గుండు హనుమంతరావు మూడు సార్లు టీవీ నంది అవార్డులు అందుకున్నారు. ఆయన నటించిన చిత్రాలు..బాబాయి హోటల్‌, పేకాట పాపారావు, అల్లరి అల్లుడు, మాయలోడు, యమలీల, శుభలగ్నం, క్రిమినల్, అన్నమయ్య, సమరసింహారెడ్డి, కలిసుందాం రా, సత్యం, పెళ్లాం ఊరెళితే, అతడు, భద్ర, ఆట, మస్కా.

గుండు హనుమంతరావు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
కొడుకు ఒక్కడే అందరు వెళ్ళిపోయే సరికి కొడుకు శోకం చెప్పలేనిది టాలీవుడ్ అంత ఒక్కసారికి షాక్ అయ్యింది , ప్రముఖులు అందరు తీవ్ర సంతాపాన్ని తెలియచేస్తున్నారు . మనం కూడా అయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుందాం .