టమోటా రోటి పచ్చడి

3

టమోటా రోటి పచ్చడి

కావలసిన పదార్ధాలు 

టమోటాలు తయారైనవి – ఎనిమిది
పచ్చి మిర్చి -పది .
కరివేపాకు – మూడు రెబ్బలు
కొత్తిమీర – ఒక కట్ట.
చింతపండు -నిమ్మకాయంత
ఉప్పు – తగినంత
పసుపు -అర స్పూను .
నూనె  మూడు స్పూన్లు .

పోపు పెట్టడానికి  కావలసిన పదార్ధాలు

ఎండుమిర్చి — ఎనిమిది
ఆవాలు – స్పూను
మినపప్పు — రెండు స్పూన్లు
జీలకర్ర — అర స్పూను
ఇంగువ — తగినంత
మెంతులు – అర స్పూను .

తయారు చేయు విధానము

బాండీలో నూనె వేసుకుని నూనె కాగగానే టమోటాలు , పచ్చి మిర్చి ముక్కలను , కొద్దిగా ఉప్పు , పసుపు వేసి మగ్గనివ్వాలి.ఇప్పుడు మళ్ళీ బాండీలో నూనె వేసి నూనె బాగా కాగగానే ముందుగా మెంతులు , ఎండుమిర్చి , మినపప్పు , జీలకర్ర , ఆవాలు మరియు కరివేపాకు పోపు పదార్ధములన్నీ వేసి పోపు పెట్టుకోవాలి.ఇప్పుడు రోటి లో ముందుగా ఎండు మిర్చి , చింతపండు , ఉప్పు , వేసి మెత్తగా పచ్చడి బండతో దంపుకోవాలి.మగ్గపెట్టిన టమోటా ముక్కలు, పచ్చిమిరపకాయలు కొత్తిమీర మిగిలిన పోపు కూడా రోటిలో వేసి మరీ మెత్తగా కాకుండా పైపైన బండతో నూరుకోవాలి .తర్వాత వేరే గిన్నెలోకి తీసుకోవాలి .
అంతే ఘమ ఘమ లాడే కొత్తిమీర ,ఇంగువ వాసనలతో టమోటో పచ్చడి సర్వింగ్ కు సిద్ధం .