తమిళ నటుడు డీఎండీకే అధ్యక్షుడు విజయ్ కాంత్ కు తీవ్ర అస్వస్థత | Tamil star Vijay kanth Hospitalized

85

తమిళ నటుడు డీఎండీకే అధ్యక్షుడు విజయ్ కాంత్ కు తీవ్ర అస్వస్థత | Tamil star Vijay kanth Hospitalized

విజయ కాంత్ ఈయన సుప్రసిద్ధ తమిళ నటుడు, రాజకీయ నాయకుడు.డీఎండీకే పార్టీ వ్యవస్థాపకుడు, సినీనటుడు క్యాప్టెన్ విజయ్ కాంత్ అనారోగ్యంతో మళ్లీ ఆసుపత్రిలో చేరారు. చెన్నైలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో విజయ్ కాంత్ చికిత్స కోసం చేరారు . విజయ్ కాంత్ icu లో చికిత్స అందిస్తున్న వైద్యులు అయన పరిస్తితి విషమంగా వుందని తెలిపిన వైద్యులు ..
కొన్ని రోజుల నుంచి ఈయన అనారోగ్యం తో బాధపడుతున్నారు నడిచే పరిస్తుతుల్లో కూడా లేరు … 8 గంటల ప్రాంతం లో విజయకాంత్ పరిస్థితి విషమించడంతో చెన్నైలోని పోరుర్ లోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో తరలించారు పరిస్థితి విషమించడం తో icu లో చేర్చి వైద్యం అందిస్తున్నారు ..
అతిగా తాగడం వల్ల అయన ఆరోగ్యం విషమించిందని ఆయన సన్నిహితులు వివరించారు అనారోగ్య పరిస్థుతుల వల్ల అయన కొంతకాలం గా ప్రజలలోకి రావడం లేదు … పార్టీ వ్యవహారాలను కూడా పట్టించుకోవడం లేదు విజయ్ కాంత్ కు ఆరోగ్యం బాగోలేదని తెలియడం తో ఆయన కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు … పార్టీ సభ్యులు అభిమనులు భారి సంఖ్యలో హాస్పిటల్ వద్దకి చేరుకుంటున్నారు
విజయ కాంత్ అసలు పేరు విజయరాజ్ అళగరస్వామి నాయుడు. ఆగస్టు 25. 1952 లో తమిళనాడులోని మధురై పట్టణంలో జన్మించినారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
2005వ సం.లో విజయకాంత్ రాజజీయ పార్టీని స్థాపించినారు. ఆ పార్టీ పేరు దేశీయ ముర్పొక్కు ద్రావిడ కళగం (డి.ఎం.డి.కె) అనగా తెలుగు అర్ధం: ద్రావిడ జాతీయాభివృద్ది సమాఖ్య.