దోసకాయ బజ్జీ రోటి పచ్చడి

13

దోసకాయ బజ్జీ రోటి పచ్చడి

తయారు చేయు విధానము

ముందుగా పచ్చని గట్టి దోసకాయను తీసుకొని కాయ అంతా నూనె రాసి స్టౌ సిమ్ లో పెట్టుకొని నాలుగు వైపులా కాల్చుకుని నీటితో తడి చేయి చేసుకుని కాలిన పై చెక్కు అంతా తీసుకొని , కాయను చిదిపి పైన కొద్దిగా పసుపు వేసి పక్కన ఉంచుకోవాలి.చింతపండు ఉసిరికాయంత పరిమాణంలో తీసుకొని తడిపి ఉంచుకోవాలి .స్టౌ మీద బాండీ పెట్టి మూడు స్పూన్లు నూనె వేసి నాలుగు ఎండుమిరపకాయలు , స్పూనున్నర మినపప్పు , కొద్దిగా మెంతులు , కొద్దిగా జీలకర్ర , అర స్పూను ఆవాలు , కొద్దిగా ఇంగువ మరియు రెండు రెమ్మలు కరివేపాకు వేసి పోపు వేయించు కోవాలి.

ఇప్పుడు రోటిలో ముందు ఎండుమిరపకాయలు ఉప్పు మరియు తడిపి ఉంచుకున్న చింతపండు వేసి మెత్తగా పచ్చడి బండతో దంపుకోవాలి.తర్వాత నాలుగు పచ్చి మిరపకాయలు కూడా రోటిలో వేసుకొని బండతో మెత్తగా దంపుకోవాలి .తదుపరి కాల్చి చిదిపి పక్కన పెట్టుకున్న దోసకాయను వేసి మరీ మెత్తగా కాకుండా బండతో నూరుకోవాలి .చివరగామిగిలిన పోపు , సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి పైపైన బండతో నూరుకుని వేరే గిన్నెలోకి తీసుకోవాలి .అంతే ఎంతో రుచిగా ఉండే దోసకాయ బజ్జీ సర్వింగ్ కు సిద్ధం .ఈ పచ్చడి అన్నం లోకే కాకుండా దోశెలు , చపాతీల లోకి కూడా చాలా బాగుంటుంది.