పెసర పప్పు రోటి పచ్చడి

10

పెసర పప్పు రోటి పచ్చడి

కావలసిన పదార్ధాలు

చాయపెసరపప్పు — 100 గ్రాములు.
ఎండు మిరపకాయలు — 8
జీలకర్ర — ఒక స్పూను
ఇంగువ — కొద్దిగా
నెయ్యి — రెండు స్పూన్లు

తయారు చేయు విధానము

ముందుగా స్టౌ మీద బాండీ పెట్టి రెండు స్పూన్లు నెయ్యి వేసి , నెయ్యి బాగా కాగగానే పెసర పప్పు , ఎండు మిరపకాయలు , జీలకర్ర మరియు ఇంగువ వేసి బంగారు రంగులో వేయించుకోవాలి .తర్వాత రోటిలో ముందుగా ఎండు మిరపకాయలు , జీలకర్ర , ఇంగువ మిశ్రమము , మూడు రెబ్బలు చింతపండు మరియు సరిపడా ఉప్పు వేసుకుని పచ్చడి బండతో మెత్తగా దంపుకోవాలి.తర్వాత వేయించిన పెసరపప్పు వేసుకుని మధ్య మధ్య నీళ్ళు చిలకరించు కుంటూ పొత్రము తో మెత్తగా రుబ్బు కోవాలి .వెల్లుల్లి ఇష్టమైన వారు ఆరు వెల్లుల్లి రెబ్బలు కూడా ఇంగువ బదులు వేసుకుని రుబ్బుకోవచ్చును .పైన మినపప్పు , ఆవాలు , రెండు ఎండుమిర్చి ముక్కలుగా చేసి వేసుకుని నేతితో పోపు పెట్టుకుంటే పచ్చడి మరింత రుచిగా ఉంటుంది.