పొదీనా రోటి పచ్చడి

12

పొదీనా రోటి పచ్చడి

కావలసిన పదార్ధాలు 

పొదీనా

నూనె — ఆరు స్పూన్లు

ఎండుమిరపకాయలు — 15

చింతపండు — నిమ్మకాయంత .

విడదీసి ఉంచుకోవాలి .

మెంతులు — స్పూనున్నర .

ఆవాలు — స్పూను

పసుపు — పావు స్పూను

ఉప్పు — తగినంత

 

తయారు చేయు విధానము

ముందుగా స్టౌ మీద బాండీ పెట్టి మూడు స్పూన్లు నూనె వేసి నూనె బాగా కాగగానే సిద్ధంగా ఉంచుకున్న పొదీనా ఆకును వేసి బాగా మగ్గ నిచ్చి దింపుకుని వేరే ప్లేటు లోకి తీసుకోవాలి .తిరిగి స్టౌ మీద బాండీ పెట్టి మిగిలిన నూనె మొత్తం వేసి నూనె బాగా కాగగానే , వరుసగా మెంతులు , ఎండుమిరపకాయలు , ఆవాలు మరియు పసుపు వేసి పోపు వేగిన వాసన వచ్చే వరకు వేయించుకోవాలి .ఇప్పుడు ముందుగా రోటిలో వేయించిన పోపు , చింతపండు మరియు తగినంత ఉప్పు వేసి పచ్చడి బండతో మెత్తగా దంపుకోవాలి .తర్వాత వేయించి సిద్ధంగా ఉంచుకున్న పొదీనా ఆకు కూడా వేసి పచ్చడి బండతో నూరుకోవాలి.తర్వాత వేరే గిన్నెలోకి తీసుకుని పైన రెండు ఎండుమిర్చి , చాయమినపప్పు మరియు ఆవాలతో పోపు పెట్టుకోవాలి .అంతే ఎంతో రుచిగా ఉండే ఈ పొదీనా పచ్చడి భోజనము లోకి సర్వింగ్ కు సిద్ధం .