మామిడి అల్లం రోటి పచ్చడి

6

మామిడి అల్లం రోటి పచ్చడి

తయారు చేయు విధానము

స్టౌ మీద బాండీ పెట్టి నాలుగు స్పూన్లు నూనె వేసి పది ఎండుమిరపకాయలు , పావు స్పూను మెంతులు , అర స్పూను ఆవాలు , రెండు రెమ్మలు కరివేపాకు మరియు అయిదు పచ్చి మిరపకాయలు వేసి వేయించుకోవాలి .నిమ్మ కాయంత చింతపండు చాలా కొద్ది నీళ్ళలో తడిపి ఉంచుకోవాలి .ఒక 50 గ్రాముల మామిడి అల్లం పై చెక్కు తీసుకుని ముక్కలుగా చేసుకుని సిద్ధం చేసి ఉంచుకోవాలి .

ఇప్పుడు రోటిలో సరిపడా ఉప్పు , వేగిన ఎండుమిరపకాయలు , కొద్దిగా పసుపు , వేసి పచ్చడి బండతో మెత్తగా దంపుకోవాలి .తర్వాత మిగిలిన పచ్చిమిర్చితో వేగిన పోపు , చిన్న ముక్కలు గా తరిగిన మామిడి అల్లం , తడిపిన చింతపండు , చాలా కొంచెం బెల్లం వేసి పల్చగా కాకుండా పచ్చడి బండతో నూరుకోవాలి ,ఆ తర్వాత వేరే గిన్నెలోకి తీసుకోవాలి .ఈ పచ్చడి ఇడ్లీ , దోశెలు , చపాతీలు మరియు భోజనము లోకి అన్నింటిలోకి కూడా చాలా రుచిగా ఉంటుంది .