godavari river boat accident | గోదావరిలో లాంచీ మునక ఘటన ఎక్స్గ్రేషియా చెల్లించి చేతులు దులుపుకున్న ప్రభుత్వం

17

godavari river boat accident

గోదావరిలో లాంచీ మునక ఘటన ఎక్స్గ్రేషియా చెల్లించి చేతులు దులుపుకున్న ప్రభుత్వం

గోదావరిలో మంగళవారం సాయంత్రం లాంచీ మునక ఘటనలో

godavari river boat accident
godavari river boat accident

– 14 మృతదేహాలు వెలికితీత
– 17మంది చనిపోయినట్లుగా ప్రభుత్వ ప్రకటన
– కానరాని మరో 11 మంది ఆచూకీ
– మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు : చంద్రబాబు

విజయవాడలో బోటు దుర్ఘటన జరిగిన తరువాత ప్రభుత్వం చనిపోయిన వారి కుటుంబాలకి డబ్బులు (ఎక్స్గ్రేషియా) చెల్లించి చేతులు దులుపుకుంది. భవిష్యత్తులో ప్రమాధాలు జరగకుండ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. రాష్ట్రంలో ఉన్న అన్ని లాంచీ/బోట్లలో లైఫ్ జాకెట్లు పెట్టాడానికి చర్యలు తీసుకోలేదు. ఒక్కరోజు దీక్షచేయడానికి 30 కోట్లు ఖర్చు పెట్టే చంద్రబాబు గారు కేవలం 30 లక్షలు ఖర్చు పెట్టి రాష్ట్రంలో ఉన్న అన్ని బోట్లకి లైఫ్ జాకెట్లు ఉచితంగా ఇవ్వొచ్చు.

ఇప్పుడు గోదావరి నదిలో జరిగిన లాంచీ దుర్ఘటన. ప్రభుత్వం ఎక్స్గ్రేషియా చెల్లించి చేతులు దులుపుకుంటుంది. భవిష్యత్తులో ప్రమాధాలు జరగకుండ ఎటువంటి చర్యలు తీసుకోదు.
తప్పు పాలకులది కాదు ప్రజలది, కళ్ళముందు వారి వైఫల్యం కనిపిస్తున్నా పదే, పదే వారికి ఓట్లేసి గెలిపిస్తున్నాము.
తెలుగుదేశం ప్రభుత్వమే కాదు గతంలో కాంగ్రెస్ పాలనలో కూడా ఎన్నో ధుర్ఘటనలు జరిగాయి.

యధారాజ తధాప్రజ..పాలకులు మారరు, ప్రజలు మారరు.
ప్రజల కన్నా నాయకుల ప్రాణాలే విలువైనవి ప్రభుత్వ డబ్బుతో పటిష్టమైన సెక్యూరిటి పెట్టుకుంటారు. వారి ప్రాణాలు చాలా గట్టివి వారు చనిపోతే చేసే హంగామ అంతా..ఇంతా కాదు. ప్రజలు చనిపోతే ఓ రోజు వార్త ఓ 5-10 లక్షలు ఎక్స్గ్రేషియా.

–ప్రసాద్ చిగిలిశెట్టి