How to become a pilot in India? | పైలట్ శిక్షణ కు కావలిసిన అర్హతలేంటి?

17

How to become a pilot in India? | పైలట్ శిక్షణ కు కావలిసిన అర్హతలేంటి?

How to become a pilot in India? | పైలట్ శిక్షణ కు కావలిసిన అర్హతలేంటి?

విమానం నడపడం అంటే సాధారణ ప్రక్రియ కాదు. చాలామందికి అదో పెద్ద కల.  అయితే ఈ శిక్షణకు అయ్యే ఖర్చును పరిగణనలోకి తీసుకుంటే, దాదాపు గా 45 లక్షలు … ఇది సామాన్యులకు అందని ద్రాక్షే అని చెప్పవచ్చు. పైలెట్ శిక్షణ కి ఎలా అప్ప్లయ్ చైయాలి? శిక్షణ వివరాలు? శిక్షణ తర్వాత అవకాశాలు ఎలా ఉంటాయి? ఇక్కడ చూడండి.

 పైలట్ కావడానికి మూడు మార్గాలున్నాయి.

  • ఎన్డీఏ (NDA-నేషనల్ డిఫెన్స్ అకాడమీ) పరీక్ష రాసి, భారత వైమానిక దళంలో పైలెట్ గా చేరడం
  • సొంత విమానం ఉంటే దానికోసం లైసెన్స్ తీసుకోవడం
  • కమర్షియల్ పైలట్ శిక్షణ తీసుకోవడం

పైలట్ ఉద్యోగాన్ని వృత్తిగా కావాలి అనుకునేవారు తీసుకోవాల్సింది… కమర్షియల్ పైలట్ శిక్షణ. అప్ప్లయ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయ్యండి

పౌరవిమానయానానికి సంబంధించిన అన్నిరకాల కార్యకలాపాలు DGCA(డీజీసీఏ) పరిధిలోనే ఉంటాయి. పైలట్ శిక్షణకు భారత్‌లో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఆమోదించిన 30 సంస్థలున్నాయి. వీటన్నింట్లో ముఖ్యమైనది ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేథీ దగ్గరలో ఉన్న ఇందిరాగాంధీ ఉడాన్ అకాడమీ. ఇది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే కమర్షియల్ పైలట్ శిక్షణ సంస్థ.

uranకమర్షియల్ పైలట్ శిక్షణ కు కావలిసిన అర్హతలేంటి?

అభ్యర్థులకు కనీసం 17 సంవత్సరాలు వయస్సు  నిండి ఉండాలి. ప్లస్ 2 లేదా ఇంటర్‌మీడియట్‌లో గణితం (MATHS), భౌతికశాస్త్రం (PHYSICS) ను  కచ్చితంగా చదివి ఉండాలి.

ఇందిరాగాంధీ ఉడాన్ అకాడమీలో ప్రవేశాలకు ప్రతి సంవత్సరం మార్చి లేదా ఏప్రిల్‌లో ప్రకటన వస్తుంది. మేలో ప్రవేశ పరీక్ష, జూన్‌లో ఇంటర్వ్యూలు జరుగుతాయి. ఈ అకాడమీ ఒక్కటే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సంస్థ. మిగిలినవన్నీ రాష్ట్ర ప్రభుత్వ ల ఆధ్వర్యంలో నడిచే సంస్థలు లేదా ప్రైవేటు శిక్షణ సంస్థలు.

పైలట్ శిక్షణ చాలా ఖరీదైన కోర్సు అని చెప్పవచ్చు. ఇందిరాగాంధీ అకాడమీలో శిక్షణలో చేరాలంటే దాదాపు రూ.45లక్షలు ఫీజు చెల్లించాలి. దీనికి ఎలాంటి స్కాలర్‌షిప్పులూ ఉండవు. కేవలం సొంత డబ్బుతోనే శిక్షణలో చేరాలి. బ్యాంక్ లోన్ సౌకర్యం ఉంటుంది.

శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి. వినికిడి, చూపు స్పష్టంగా ఉండాలి. కళ్లజోడు ఉండకూడదు అనే నిబంధన ఏమీ లేదు. కళ్లజోడు వాడుతున్నా చూపులో స్పష్టత ఉంటే చాలు.

ఈ కోర్సు వ్యవధి 18 నెలల నుంచి 24 లేదా 30 నెలల వరకూ ఉంటుంది. నిబంధనల ప్రకారం పూర్తి చేయగలిగితే 18 నెలల్లోనే లైసెన్స్ పొందవచ్చు.

శిక్షణ ఎలా ఉంటుంది?

శిక్షణలో భాగంగా ఎయిర్‌క్రాఫ్ట్ నేవిగేషన్, ప్లానింగ్, ఏవియేషన్ మీటియొరాలజీ, రెగ్యులేషన్స్, కాక్‌పిట్ రిసోర్స్ మేనేజ్‌మెంట్‌లపై పూర్తి స్థాయి అవగాహన కల్పిస్తారు. దీనితోపాటు పైలట్ ఇన్ కమాండ్‌గా 100 గంటల పాటు ఫ్లయింగ్ అవర్స్, 20 గంటల పాటు దేశ వ్యాప్తంగా నడపడం, ఇన్‌స్ట్రుమెంటల్ స్టడీకి 10 గంటలు, రాత్రిపూట విమానం నడపడంపై 5 గంటల పాటు ప్రాక్టికల్ శిక్షణ ఉంటుంది.

ఏ సంస్థలో శిక్షణ పూర్తి చేసినా… చివర్లో లైసెన్స్ కోసం రాసే పరీక్ష మాత్రం డీజీసీఏ నే నిర్వహిస్తుంది. ఆ పరీక్షలో ఉత్తీర్ణులైతేనే మీకు కమర్షియల్ పైలట్ లైసెన్స్ లభిస్తుంది. ఈ పరీక్ష ఏడాదిలో మూడుసార్లు జరుగుతుంది.

తెలంగాణలో ఒక రాష్ట్ర ప్రభుత్వ సంస్థ, రెండు ప్రైవేట్ సంస్థలు కమర్షియల్ పైలట్ శిక్షణను అందిస్తున్నాయి. వీటిలో ఫీజు రూ.35 లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ ఉంటుంది. శిక్షణ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం కోసం విమానయాన సంస్థలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

శిక్షణ తర్వాత అవకాశాలు ఎలా ఉంటాయి?

చాలా సంవత్సరాల క్రితం భారత్‌లో తగిన సంఖ్యలో పైలట్లు లేకపోవడంతో… విదేశాలనుంచి తీసుకొచ్చి మన దేశీయ ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగాల్లో చేర్చుకునేవారు. ఈ కొరతను తీర్చడానికే ఇందిరాగాంధీ ఉడాన్ అకాడమీని ఏర్పాటు చేశారు.

ప్రస్తుతం ఎన్నో ప్రైవేట్ విమానయాన సంస్థలు మార్కెట్లో ఉన్నాయి. అందువల్ల ఉద్యోగావకాశాలకు కొదవ లేదు. కమర్షియల్ పైలట్ శిక్షణ ఎంత ఖర్చుతో కూడుకున్నదో… వీరి జీతభత్యాలు కూడా అంతే ఎక్కువగా ఉంటాయి. అందువల్ల శిక్షణకోసం ఎక్కువగా ఖర్చు పెట్టినా… బాధపడవలసిన అవసరం ఉండకపోవచ్చు.