How to become an air hostess in india | ఎయిర్ హోస్టెస్, క్యాబిన్ క్రూ కావడం ఎలా?

How to become an air hostess in india | ఎయిర్ హోస్టెస్, క్యాబిన్ క్రూ కావడం ఎలా?

విమానం అనగానే ముందుగా చాలామందికి గుర్తొచ్చేది ఎయిర్ హోస్టెస్. అందమైన రూపంతో, చక్కటి మాటతీరుతో ప్రయాణికులకు విమానప్రయాణంలో ఎదురయ్యే అవసరాలన్నింటినీ తీర్చే సహాయకారి.

విమానాల్లో అవసరమైన ఎయిర్ హోస్టెస్లను అంతర్జాతీయ భద్రతా నిబంధనల ద్వారా తప్పనిసరి. 19 ప్యాసింజర్ సీట్లు కలిగిన విమానాల కోసం, ఎయిర్ హోస్టెస్ అవసరం లేదు. పెద్ద విమానాల కోసం, 50 ప్రయాణీకుల సీట్లకు ఒక ఎయిర్ హోస్టెస్ అవసరమవుతుంది.

ఎయిర్ హోస్టెస్ యొక్క ప్రాధమిక పాత్ర ప్రయాణీకుల భద్రతను నిర్ధారించడం. దీనికి తోడు, విమాన సేవకులు తరచూ భోజన మరియు పానీయాల సేవలను రెండింటిలో బాధ్యతగా కస్టమర్ సేవ విధులు నిర్వహిస్తారు.

ఎయిర్ హోస్టెస్, క్యాబిన్ క్రూ  కావడం ఎలా?

విమానయాన రంగంలో ఉద్యోగాలకు అవసరమైన అర్హతలు, పూర్తి చేయాల్సిన శిక్షణకు సంబంధించి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) చాలా స్పష్టమైన నిబంధనలు రూపొందించింది.

మనం విమానంలోకి ప్రవేశించగానే మనకు ఎదురయ్యేది క్యాబిన్ క్రూ. వీరి పని కేవలం ప్రయాణికులను సాదరంగా ఆహ్వానించడం మాత్రమే కాదు, ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ప్రయాణికులను బయటకు వీలైనంత త్వరగా  సురక్షితంగా ఎలా పంపించాలి, వైద్య సహాయం అవసరమైతే చేయాల్సిన ప్రథమ చికిత్స ఏంటి.. ఇలాంటి చాలా అంశాలపై వీరికి శిక్షణ అవసరం.

ఎయిర్ హోస్టెస్, క్యాబిన్ క్రూ కావాలంటే అర్హతలేమిటి?

10+2 ఉత్తీర్ణులు అర్హులు. ఆకర్షణీయమైన రూపం, ఆకట్టుకునే మాటతీరు, మీరు చెప్పదలచుకున్న అంశాల్ని స్పష్టంగా చెప్పగలుగుతున్నారా లేదా, ఇంగ్లిష్ భాషలో మాట్లాడగలిగే సామర్థ్యం… ఇవీ ప్రధానంగా అభ్యర్ధి కి కావాల్సిన అంశాలు. మీకు ఏదైనా విదేశీ భాష వచ్చి ఉంటే అది మీకు మరింత ఉపయుగం గా ఉంటుంది. వీటితోపాటు శారీరకంగా కూడా ఆరోగ్యంగా, నిర్దేశిత ఎత్తుకు తగిన బరువు, మంచి కంటి చూపు కలిగి ఉండాలి.

వీటితో పాటు మన దేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాష హిందీ కూడా వచ్చి ఉండాలి. ఎందుకంటే అన్ని ప్రాంతాల ప్రయాణికులతో మాట్లాడాల్సి ఉంటుంది కాబట్టి.. భారత్‌లో ఎయిర్ హోస్టెస్‌గా పనిచేయాలంటే ఇంగ్లిష్, హిందీ… ఈ రెండు భాషలూ వచ్చి ఉండాలి.

మరో ముఖ్యమైన అంశం ఎమిటి అంటే… పాస్‌పోర్ట్. మీరు ఉద్యోగంలో చేరిన తర్వాత విధుల్లో భాగంగా  విదేశీ విమాన సర్వీసుల్లో కూడా ప్రయాణించాల్సి రావచ్చు. అందువల్ల పాస్‌పోర్ట్ కలిగిఉండటం తప్పనిసరి.

How to become an air hostess in india

శిక్షణ ఎలా ఉంటుంది?

సాధారణంగా విమానయాన సంస్థలన్నీ వేటికవే శిక్షణ సంస్థలను ఏర్పాటు చేసుకున్నాయి. వాటి ద్వార నేరుగా ఇంటర్వ్యూ ద్వారానే అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. ఎంపికైనవారు సుమారు రూ.50000 వరకు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. శిక్షణ పూర్తికాగానే తమ సంస్థల్లోనే వీరికి అవకాశాలు కల్పిస్తారు.

శిక్షణలో భాగంగా… విమానం పనితీరు, ప్రయాణం జరిగే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అత్యవసర పరిస్థితులు-చర్యలు, ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు,… ఇలాంటి అంశాలన్నీ వివరిస్తారు. వీటితోపాటు ఫ్లయింగ్ అవర్స్ కల్పిస్తారు. ప్రతి సంవత్సరం నిర్దేశిత ఫ్లయింగ్ అవర్స్ ఉండటం డీజీసీఏ- DGCA నిబంధనల ప్రకారం తప్పనిసరి.

పైలట్ ఏదైనా అనారోగ్యం పాలైనా, ప్రయాణికులతో సమస్యలు, సిబ్బంది మధ్య సమస్యలు, ప్రయాణికుల మధ్య సమస్యలు… ఇలాంటి పరిణామాల్లో ఎలా పనిచేయాలో కూడా క్యాబిన్ క్రూ లేదా ఎయిర్ హోస్టెస్‌లకు తెలిసి ఉండాలి. అవసరమైతే విమానాన్ని నడపగలిగే సామర్థ్యం కూడా వీరికి ఉండాలి. దీనిపై కూడా శిక్షణ అవసరం.

ఇవి కాకుండా ప్రైవేటు ట్రైనింగ్ స్కూళ్లు కూడా కొన్ని ఉన్నాయి. వీటిలో శిక్షణ తీసుకుంటే ఉద్యోగం కోసం మళ్లీ ప్రయత్నించాల్సిందే. డీజీసీఏ వెబ్‌సైట్‌లో క్యాబిన్ క్రూ శిక్షణకు సంబంధించిన కోర్సుల వివరాలు లభిస్తాయి.