ప్రతి సామాన్యుడు ఆలోచించవలసిన విషయం – జనసేన ఇది మనసేన | Latest jana sena party breaking news

43

ప్రతి సామాన్యుడు ఆలోచించవలసిన విషయం – జనసేన ఇది మనసేన | Latest jana sena party breaking news

1) దేశ ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించాల్సిన హస్పిటల్స్ ని వ్యాపార దృక్కోణంలో చూస్తున్న ప్రభుత్వాలు ముందు సిగ్గుపడాలి…!!!

2) మెరిట్ ఆధారంగా సీటు రాకపోతే కోటి, రెండు కోట్లు పెట్టి బ్లాక్ లో టికెట్స్ అమ్ముతున్న చందంగా మెడికల్ సీట్లు అమ్ముతున్న తీరును, దానిని కొంత మంది బడా బాబులు కొంటున్న తీరును అరికట్టాలి… ఎందుకూ అంటే మెడిసిన్ అనేది ఒక బాధ్యత… అర్హుడు మాత్రమే ఆ కాలేజీ ప్రాంగణంలోకి అడుగుపెట్టాలి…!!!

3) ఒక దేవుడిలా మనిషి జీవితాన్ని నిలబెట్టాల్సిన ఒక డాక్టర్, పేద ధనిక బేధంలేకుండా న్యాయాన్ని కాపాడాల్సిన లాయర్, ప్రజలకు ప్రజలు కట్టే పన్నులకు న్యాయం చేసే విధంగా విధానాలు అమలు చేయాల్సిన బ్యూరోక్రాట్స్, ఇక దేశ సార్వభౌమత్వాన్ని పార్లమెంట్ సాక్షిగా నిలబెట్టాల్సిన రాజకీయనాయకులు ఆలోచించి కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి, నడుచుకోవాలి…!!!

4) అబ్దుల్ కలాం గారు తాను కనుగొన్న మిస్సైల్ ఫార్ములా(మేధా శక్తిని) ఎంతకి అమ్ముకోగలరో??? కాని దేశానికి దారబోశారు. అగ్ని, పృథ్విని దేశ సంరక్షణకు కాకుండా బయటదేశాలకు అమ్ముకుంటే ఆయనకు ఎంత డబ్బు వచ్చేదో???

5) ఏదీ మనదేశంలో పేదవాడి ఆరోగ్యానికి భరోసా??? సంక్రాతి  కిరణ్ (సంకురాత్రి ఫౌండేషన్ కాకినాడ) వ్యాపార దృక్కోణంలో చూసివుంటే ఈపాటికి ఆయన ఎంత డబ్బు సంపాదించేవాడో???

6) A neuro surgeon like Mr. Manas Paanigrahi is forced to deliver a specific amount of business for a day and offered a specific amount of commission then how the medical system can reach the downtrodden with an amicable ideas & with a deliberate system???

7) Lot to change and India suld build from the ethics of an Individual but not from the unfair regulations… Finally there should be a strong hold to the governments on medical system and its insider trading…!!!

ఒక దేశ సైనికుడు లక్ష రూపాయిల జీతాన్ని డిమాండ్ చేస్తే???

డ్రైనేజీ లోకి దూరి ప్రాణాలు పణంగా పెట్టి పనిచేసే ఒక పారిశుధ్య కార్మికుడు లక్ష జీతం డిమాండ్ చేస్తే???

హాస్పిటల్ లో పేషెంట్స్ మలినాలు, లోపల భాగంలో వ్యర్ధాలు తీసి క్లీన్ చేసి ఆ భయంకర వాతావరణంలో ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పనిచేసే ఒక హౌస్ క్లీనర్ ఎక్కువ జీతం డిమాండ్ చేస్తే???

కొన్ని వృత్తులకు చదువు ఒక్కటే కొలమానం కాదు కదా??? ఆలోచించండి…!!!

జై జనసేన…!!! జై భారత్…!!!

మీ,
వెంకట సతీష్ డేగల
Desamkosam Jaijanasena

మరిన్ని వార్తలకి మా వెబ్ సైట్ TNBNTv ని ఫాలో అవ్వండి