Mithali raj overtakes rohit sharma in t20

టీ20ల్లో రోహిత్‌ను వెనక్కినెట్టిన మిథాలీరాజ్| Mithali raj overtakes rohit sharma in t20

Mithali raj overtakes rohit sharma in t20

మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన మిథాలీ(56; 47బంతుల్లో 7×4) అర్ధశతకంతో రాణించి, అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో రికార్డు సృష్టించింది.. దీంతో భారత్‌ తరఫున టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన మహిళా క్రికెటర్‌గా మిథాలీ(2,232 పరుగులు, 79 ఇన్నింగ్స్‌లు) అందరి కంటే ముందు వరుసలో నిలిచింది.

వయసు పెరిగినా ఆటతీరులో చేవ తగ్గలేదని హైదరాబాద్ బ్యాటర్ మిథాలీరాజ్ నిరూపించింది. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా నిలిచిన రోహిత్‌శర్మ రికార్డును మిథాలీ అధిగమించి తొలిస్థానంలో నిలిచింది.

అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్ల జాబితాలో మిథాలీ రాజ్‌ ప్రస్తుతం ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఆమె కంటే ముందు న్యూజిలాండ్‌ బ్యాట్స్‌వుమెన్‌ సుజీ బేట్స్‌(2913) అగ్రస్థానంలో ఉండగా, విండీస్‌ బ్యాటర్‌ టేలర్‌(2691), ఇంగ్లాండ్‌కు చెందిన ఎడ్వర్డ్స్‌(2605), ఆస్ట్రేలియా క్రికెటర్ లానింగ్‌(2241) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.

for more sports news click here