ఆయుర్వేదం నందు తమలపాకు ఉపయోగాలు – కాళహస్తి వెంకటేశ్వరరావు అనువంశిక ఆయుర్వేద వైద్యులు

72

ఆయుర్వేదం నందు తమలపాకు ఉపయోగాలు – కాళహస్తి వెంకటేశ్వరరావు అనువంశిక ఆయుర్వేద వైద్యులు

ఆయుర్వేదం నందు తమలపాకు ఉపయోగాలు –
1.తమలపాకు కొంచెం చేదు , కారం రుచి కలిగియుండును.
2.బెంగాల్ నుంచి వచ్చే తమలపాకు కంటే దక్షిణ భారతదేశం నందు దొరుకు దళసరిగా కొంచం నలుపురంగు కలిగినవి వైద్యం నందు ఎక్కువ ఉపయోగంగా ఉంటాయి .
3.తమలపాకు ఉపయోగించడం వలన నోటిజిగట, దుర్గంధం , శ్లేష్మము , వాతము , గుండెల్లో భారము , అజీర్ణం పొగొట్టును.
4.ఆకలి తక్కువ ఉన్నవారు దీనిని ఉపయోగించుట వలన ఆకలి పెరుగును.
5.దేహములో ఉండే దుష్ట పదార్ధాలని తీసివేయను .
6.గొంతుక , రొమ్ముని శుభ్రపరచును.
7.జ్వరం , దగ్గు, శ్లేష్మము ఉన్న సమయంలో తమలపాకు వెచ్చచేసి రసము తీసి సేవించిన ఉపయుక్తముగా ఉండును. మోతాదు 15ml లేదా 3 టీస్పూన్స్ రెండుపూటలా వాడవలెను .
8. కొంతమందికి మెదడు గట్టిపడటం జరిగి ఉత్సాహముగా ఉండరు. వారికి పైన చెప్పిన మోతాదులో రెండుపూటలా ఇవ్వడం వలన వారిలో అద్భుత ఫలితాలు కనిపిస్తాయి .
9.శిశువులకు విరేచనం కానప్పుడు తమలపాకు తొడిమను ఆముదములో ముంచి బిడ్డల మలద్వారం ద్వారా లొపలికి చొప్పించిన విరేచనం అగును.
10. గొంతులో పుండు వచ్చినపుడు తమలపాకుకి ఆవనూనె రాసి వెచ్చచేసి గొంతుక మీద వేసి కట్టిన గొంతుక పుండు మానును.
11. హిస్టీరియా వ్యాధిగ్రస్తులకు దీని రసంలో కొంచం కస్తూరి కలిపి ఇచ్చిన నయం అగును.
12.మూత్రం బంధించినప్పుడు తమలపాకుల కు ఆముదం రాసి వెచ్చచేసి పొట్టపైన వేసినచో కేవలం 10 నిమిషాలలో మూత్రం బయటకి వచ్చును . ఇది నేను ప్రయోగించాను.
13. చిన్న పిల్లలకు దగ్గు , జలుబు బాగాచేసి గాలిపీల్చుకోవడం ఇబ్బంది అవుతున్నప్పుడు పైన చెప్పిన విధంగా ఆకులకు ఆముదం రాసి వెచ్చచేసి రొమ్ముపైన వేయాలి .
14. పక్కనొప్పి , లివర్ గట్టిపడటం వంటి సమస్యలు ఉన్నప్పుడు ఆకులకు ఆముదం రాసి వెచ్చచేసి కుడిపక్కన చంక క్రింద , లివరు భాగంలో వేయుచున్న ఆ సమస్యలు తీరును.
15. స్త్రీల చన్నులపై వేడిచేసి వేసిన పాలు హరించును . గవదలపైన వేసిన టాన్సిల్స్ హరించును .

 

గమనిక

=>ఎండినవి , పురుగు పట్టినవి వైద్యానికి వాడరాదు.

=>స్త్రీలు ఎక్కువ ఉపయోగించరాదు. గర్భాశయ సమస్యలు వస్తాయి.

=>సున్నం వేసిన ఆకులు వైద్యానికి పనికిరావు.

గ్రంధం కావలసినవారు దయచేసి మీరు డైరెక్ట్ గా మాత్రమే సంప్రదించగలరు.

కాళహస్తి వెంకటేశ్వరరావు
9885030034
అనువంశిక ఆయుర్వేదం