రవ్వ లడ్డు | Rava laddu recipe in telugu

69

రవ్వ లడ్డు 

రవ్వ లడ్డుకి  కావలిసిన పదార్ధాలు

బొంబాయి రవ్వ  1/2 కేజి
పంచదార  1 కేజి
ఎండు కొబ్బరి 2 చిప్పలు
యాలకులు4
జీడిపప్పు10
కిసమిస్10
పాలు1 కప్పు
నెయ్యి లేదా డాల్డా  100గ్రా

రవ్వ లడ్డు  తయారుచేసే విధానం 

  1. ముందుగా బొంబాయి రవ్వ ని నూనె నెయ్యి లేకుండా దోరగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి.
  2. ముందుగా కొబ్బరిని తురుముకొని , మరియు యాలకులను పొడి చేసుకొని వుంచుకోవాలి.
  3. ఇప్పుడు పాన్ లో ముందుగా తురుముకున్న కొబ్బరిని వేయించిన రవ్వని  మరియు పంచదార ఈ మూడింటిని కలిపి సన్నని సెగ తో వేయించుకోవాలి , ఇప్పుడు కొద్దిగా నెయ్యి అలాగే కొద్దిగా పాలు జల్లాలి .
  4. ఇప్పుడు యాలకులు జీడిపప్పు మరియు కిస్ మిస్ వేసి కలుపుకోవాలి .
  5. ఇప్పుడు మరికొన్ని పాలు చల్లి కొద్దిగా నెయ్యి వేసి కలిపి దించాలి
  6. ఇప్పుడు పాలు తడిచేసుకుంటూ ఉండలు గా తయారు చేసుకోవాలి.

అంతే చాలా సింపుల్ గా ఎంతో రుచి కరమైన రవ్వ లడ్డు తాయారు అయిపోతుంది , ఈ లడ్డూలు పది రోజుల వరకు నిల్వ వుంటాయి