Realme U1 | సెల్ఫీల కోసం ప్రత్యేకమైన రియల్ మి యు1 ఫోన్ …

Realme U1 | సెల్ఫీల కోసం ప్రత్యేకమైన రియల్ మి యు1 ఫోన్ …

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ప్రస్తుతం మిడ్‌రేంజ్ ఆండ్రాయిడ్ ఫోన్‌ల పోటీ కొనసాగుతోంది. చైనా దిగ్గజం ఒప్పో సబ్‌ బ్రాండ్‌ రియల్‌మి ఈ రోజు ఇండియా మార్కెట్లోకి సరికొత్త ఫోన్ రియల్ మి యు1 (Realme U 1) ను  లాంచ్ చేసింది.

6.3 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వెనుక భాగంలో 13, 2 మెగాపిక్సల్ కెమెరాలు రెండు ఉన్నాయి. ముందు భాగంలో 25 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌కు వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు.

ఇందులో మీడియాటెక్ హీలియో P70 SoC చిప్‌సెట్‌ను ఏర్పాటు చేశారు.దీని వల్ల ఫోన్ వేగంగా పనిచేస్తుంది.అలాగే గతంలో విడుదలైన రియల్ మి 2 ప్రో ఫోన్ లో అందించినటువంటి డ్యూడ్రాప్ నాచ్ డిస్‌ప్లే తో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది . ఈ ఫోన్‌కు ప్రధాన హైలైట్ నిలిచిన AI బ్యూటీ టెక్నాలజీ సహజసిద్ధమైన అందంతో మునుపెన్నడూ చూడని సెల్ఫీలను అందిస్తుంది

ఫీచర్లు…Realme U1

  • 3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే,
  • 2350 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,
  • గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్,
  • ఆక్టాకోర్ ప్రాసెసర్,
  • 3/4 జీబీ ర్యామ్,
  • 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్,
  • డ్యుయల్ సిమ్,
  • డెడికేటెడ్ మొమొరీ కార్డ్ స్లాట్,
  • ఆండ్రాయిడ్ 1 ఓరియో,
  • 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు,
  • 25 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా,
  • 4జీ వీవోఎల్‌టీఈ,
  • బ్లూటూత్ 2,
  • 3500 ఎంఏహెచ్ బ్యాటరీ.

ధర…

బేసిక్‌ మోడల్‌ 3జిబి ర్యామ్ ఫోన్‌ను రూ. 11,999 ధరలో కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది. అలాగే 4జీబీ, 64 జీబీ స్టోరేజి వేరియంట్‌ ధర రూ.14,499గా నిర్ణయించింది.

బ్రేవ్ బ్లూ, యాంబిషియస్ బ్లాక్ రంగులలో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. డిసెంబర్ 5నుంచి అమెజాన్ లో ప్రత్యేకంగా లభించనుంది.

ఆఫర్లు …

ఈ ఫోన్‌పై కొన్ని ఆఫర్లను కూడా ప్రకటించారు. ఎస్‌బీఐ కార్డ్స్‌తో 5 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ను అందిస్తున్నారు. జియో తన యూజర్ల కోసం ఈ ఫోన్ ద్వారా 4.2 టీబీ అదనపు డేటాను ఉచితంగా అందిస్తున్నది.

for more news click here

for more Tech news please visite TNBNTV