sumalatha husband ambarish no more | ambarish passed away | family,celebrities tribute

13

sumalatha husband ambarish no more | ambarish passed away | family,celebrities tribute

ప్రముఖ సినీనటుడు స్యాండిల్ వుడ్ రెబల్ స్టార్, నటి సుమలత భర్త అంబరీష్‌(66) కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న అంబరీష్‌ బెంగళూర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. కన్నడ నటుడు అంబరీష్ మృతిపట్ల శాండల్‌వుడ్ సంతాపం ప్రకటించింది. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.

 sumalatha husband ambarish no more | ambarish passed away | family,celebrities tribute

అంబరీష్ 1952, మే 29న మైసూర్ స్టేట్ (ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రం) లోని, మండ్య జిల్లా, దొడ్డరాశినకెరె గ్రామంలో హుచ్చెగౌడ, పద్మమ్మ దంపతుల ఏడుగురు సంతానంలో ఆరవవాడిగా జన్మించాడు. అంబరీష్ అసలు పేరు అమర్‌నాథ్. అంబరీష్  ప్రాథమిక విద్యాభ్యాసం మండ్య పట్టణంలో జరిగింది. ఆ తరువాత మైసూరులో ఉన్నత విద్య అభ్యసించారూ.

ప్రముఖ కన్నడ చలనచిత్ర దర్శకుడు పుట్టణ్ణ కనగాళ్ తన నాగరహావు చిత్రానికి ప్రతినాయకుని పాత్రకు సరైన నూతననటుని కోసం వెదుకుతూ అంబరీష్‌ను ఎంపిక చేశారూ. ఆవిధంగా అంబరీష్ 1972 తొలిసారిగా సినిమాలలో అడుగుపెట్టారూ. అప్పటి నుండి అంబరీష్ అనేక కన్నడ,తమిళ,మలయాళ,తెలుగు,హిందీ చిత్రాలలో నటించారూ. అంబరీష్ అత్యధిక సినిమాలలో నటించి రాజ్‌కుమార్ (206 చిత్రాలు), విష్ణువర్ధన్‌ (230 చిత్రాలు)ల రికార్డు ను బద్దలు కొట్టారూ. అంబరీష్  కి  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఎన్.టి.ఆర్.పురస్కారం, ఫిల్మ్‌ఫేర్, ఉత్తమ నటుడు పురస్కారం, ఫిల్మ్‌ఫేర్ జీవిత సాఫల్య పురస్కారాలు లభించాయి.

డిసెంబర్ 8, 1992 న తెలుగు నటి సుమలత ను ప్రేమించి పెళ్ళి చేసుకొన్నారు. నటి సుమలత తెలుగు తెరకు సుపరిచితురాలే. ఆమె అన్ని దక్షిణాది భాషల్లో, హిందీ సినిమాల్లో సినిమాలు చేశారు.

వీరి కి ఒక్క కుమారుడు అభిషేక్ గౌడ, కుమారుడు  కూడా సినిమా నటుడే.

అంబరీష్  1994లో భారత జాతీయ కాంగ్రెస్ లో చేరారూ. 1996 సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించి టికెట్ దక్కనందువల్ల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారూ. తరువాత అంబరీష్ జనతాదళ్ లో చేరి 1998లో మాండ్య శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి గెలిచాడు. అంబరీష్ తిరిగి కాంగ్రెస్‌లో చేరి మాండ్య పార్లమెంటరీ నియోజకవర్గం నుండి రెండు పర్యాయాలు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైనారూ. అంబరీష్ 14వ లోక్‌సభలో ప్రదాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం లో సమాచార ప్రసార శాఖ మంత్రి గా పనిచేశారూ, అయితే కావేరీ ట్రిబ్యూనల్‌ కేటాయింపులకు నిరసనగా రాజీనామా చేశారూ. చివరి గా 2009లో జరిగిన సాధారణ ఎన్నికలలో పోటీ చైసి ఓడిపోయారూ.

అంబరీష్ 2014 నుండి ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారూ. 2018, నవంబర్ 24 శనివారం సాయంత్రం ఇతని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హుటాహుటిన బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స ప్రారంభించిన కొద్దిసేపటికే అంబరీష్ తుదిశ్వాస విడిచారూ.

for more news click here

for more political news please visite TNBNTV