దంత ధావనం దంత సౌందర్యం

37

దంత ధావనం దంత సౌందర్యం

దంత ధావనం అంటే ఏంటో అనుకున్నార అంటే పళ్ళు తోముకోవడం .ఏ ఏ చెట్ల పుల్లలతో పళ్ళు తోముకుంటే  ఎలాంటి ఫలితం కలుగుతుందో మన ఆయుర్వేద తాతయ్యలు ఎన్నో వేల సంవత్సరాల నాడే మనకు చెప్పారు .తూర్పు వైపు గాని ,పడమర వైపు గాని తిరిగి కుర్చుని 12 అంగుళాల పొడవు ,చిటికెన వేలంత మందము ఉన్న మొఖం పుల్లతో ,చిగుళ్ళకు హాని జరగకుండా పండ్లు తోముకోవాలి .మర్రి పుల్లతో పండ్లు తోముకంటే పండ్లకు పండ్లకు శరీరానికి మంచి కాంతి కలుగుతుంది ,కానుగ పుల్లతో కడుక్కుంటే కార్యసిద్ధి కలుగుతుంది ,రేగు పుల్లతో కడుక్కుంటే మధురమైన కంట ధ్వని ఏర్పడుతుంది ,చండ్ర పుల్లతో కడుక్కుంటే నోటికి మంచి పరిమళం కలుగుతుంది .మేడి  మరియు సంపెంగ పుల్లలతో పళ్ళు తోముకుంటే , వాక్సిద్ది మంచి వినికిడి శక్తీ కలుగుతుంది  ,మామిడి పుల్లతో తోముకుంటే ధారణ శక్తీ జ్ఞాపక శక్తి పెరుగుతుంది ,దానిమ్మ పుల్లతో పళ్ళు తోముకుంటే సౌందర్యాభివృద్ది పెరుగుతుంది .వేప పుల్లతో పళ్ళు తోముకుంటే సర్వ సౌబాగ్యా లు కలుగుతాయి .అయితే విపరీతమైన దంత రోగాలు కాని చెవి రోగాలు కానీ ముక్కు వ్యాధులు కానీ కంట వ్యాధులు కాని సరిర రోగాలు కాని దగ్గూ గుండె జబ్బులు వున్నవాళ్ళు పళ్ళు తోముకోవడాని పుల్లలు వాడకూడదు .వేప పుల్ల కాని గానుగ పుల్లలు కానీ ఉత్తరేణి పుల్లలు కాని నీడలో ఎండ బెట్టి దంచి జల్లెడబెట్టి మెత్తగా చూర్ణంగా తయారు చేసుకొని ఆ పొడి తో పళ్ళు తోముకోవచ్చు ,తరువాత తోముకోవడాని ఉపయోగించిన పుల్లని రెండు బద్దలుగా చీల్చి వాటితో నాలుకను శుభ్రం గా గీయాలి దీనివల్ల నోటి దుర్వాసన రుచి తెలియకుండా పోవడం చిగుళ్ళు వాపులు రాకుండా ఉంటాయి .