ఆర్టీసీ పబ్లిక్ (ప్రజల) సర్వీస్ కోసమా లేక పార్టీ సర్వీస్ కోసమా?

11

ఆర్టీసీ పబ్లిక్ (ప్రజల) సర్వీస్ కోసమా లేక పార్టీ సర్వీస్ కోసమా?

ఈరోజు కాకినాడలో బాబు గారి మీటింగ్ అంటా . ఒక్క ఆర్ టి సి బస్ కూడా రోడ్ మీద తిరగడం లేదు అన్ని బస్ లు కూడా కాకినాడ మీటింగ్ కి జనాన్ని తీసుకుపోవడానికి చుట్టు ప్రక్కల ప్రతీ ఊరికి బస్సులు పంపేసాడు . ఉదయం నుండి ప్రయాణికులు , స్కూల్ కి , కాలేజ్ వెళ్ళే వారందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు బస్ లు లేక .
అయ్యా చంద్రబాబు గారు మీ పార్టీ మీటింగ్ ల కోసం ప్రజలను ఇబ్బంది పెట్టకండి . మీ మీటీంగ్ ల కోసం ప్రభుత్వ బస్ లను వాడుకోవడం ఏంటీ ? మీరుచేస్తున్న ఈ పనికి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు . చేతిలో అధికారం ఉందికదా అని మీ ఇష్టానుసారం చేయకూడదు.
1. ఈరోజు ఉభయగోదావరి జిల్లాల్లో నరకం చూసిన ప్రయాణికులు, విద్యార్డ్జిని విద్యార్థులు , రోగులు …
2.కాకినాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దీక్షకు ఉన్న ఆర్టీసీ బస్సులను సీఎం స్పెషల్ అని వాడేసుకుంటే ప్రయాణికులు ఎలా వెళ్తారు.
3.కాలేజీలు ఓపెన్ చేశారు దూర ప్రాంతాల నుంచి విద్యార్థులు తల్లితండ్రులు,రోగులు రాజమండ్రి, కాకినాడ తణుకు రావులపాలెం లాంటి నగరాలకు వెళ్తుంటారు అందుకే 9 డిపోల బస్సులు నడుపుతారు ఒక్కబస్సు కూడా ప్రయాణీకులు కోసం కాకుండా టీడీపీ మీటింగ్స్ కోసం ప్రభుత్వం పేరుతో వాడేస్తుంటే వాడికి ఆదాయం ఎవరు ఇస్తారు సుమారు 650 బస్సులు టీడీపీ దీక్ష కోసం వాడారు ఆర్టీసీకి నష్టాలు ఎందుకు రావు ఈరోజు 1300 ఆర్టీసీ సిబ్బంది జీతం ఎవరు ఇస్తారు.
4.ఈరోజు ఉభయగోదావరి జిల్లాల్లో సుమారు 6 లా కాలేజీలలో 1700 మంది విద్యార్థులు పరిక్ష రాస్తున్నారు బస్సులు లేక పరీక్ష కు టైం కి కూడా అందుకోలేక పోయారు ఉన్న ప్రతి బస్సు స్టేషన్స్ వద్ద విద్యార్ధులు వర్షం లో బస్సులు కోసం గంటల తరబడి నిరీక్షించారు ఇదా ప్రజాప్రభుత్వం ఇద్దరు మంత్రులు ఉన్న జిల్లా అయినా సిగ్గు చరం లేకుండా తమ స్వార్ధం కోసం ప్రజల సర్వీస్ ని పొలిటికల్ సర్వీస్ గా మార్చి అధికారం మా చేతుల్లో ఉంది అంతా మాయిష్టం అని తమ సోంత సోమ్ములు అన్నట్టు ఉంది వ్యవహారం.
5.ఆర్టీసీకి సీనియర్ IPS అధికారిని ఎండి గా నియమిస్తారు IPS అంటే ఇండియన్ పోలీస్ సర్వీస్ కానీ మన ఆర్టీసీ ఎండీ పెరుమార్చుకుని ఇండియన్ పొలిటికల్ సర్వీస్ చేస్తున్నారు. కనీసం కలెక్టర్ కూడా అదే రీతిగా ఉంది వ్యవహరం
6.విదేశాల్లో ఎక్కడా కూడా పబ్లిక్ వాహనాలు సోంతానికి వాడరు మన రాష్ట్రంలో ఈ జాడ్యం ఎక్కువ ప్రజా పరిపాలనా లేక ప్రజా భక్షక పాలన .
7.రేపు వైసీపీ కానీ జనసేన కానీ మరలా టీడీపీ అధికారంలోకి రావొచ్చు ఎవ్వరు వచ్చినా ఇలా ప్రజల ఆస్తుల్ని స్వార్ధం కోసం వాడితే కోటిపల్లి ఎపుడు ఇలాంటి వాటిని ఎండగట్టడానికి ఉంటుంది.
8.ఆలోచించండి ప్రశ్నించండీ ఎవరి అబ్బా సోమ్ము కాదు ఆర్టీసీ నష్టాల్లో ఉంటే టికెట్ రేటు పెంచి ప్రజల మీద భారం వేస్తారు ఈరోజు టీడీపీ సబ వలన ఆర్టీసీకి 23 లకలు పైనే
9.మొన్న నవనిర్మాణ దీక్ష అని రోడ్లు స్తంభన చేసి సోంత జాగిర్ లా వాడేయ్యడం నీతి నిజాయితీ ఉన్న పోలీసులు కూడా రాజకీయ నాయకులకు తలొగ్గి పొలిటికల్ సర్వెంట్స్ లా మారి పార్టీలకు ఊడిగం చేస్తూ రాజకీయ నాయకులు చేతుల్లో కీలు బొమ్మలా మారారు..
10.టీడీపీ కి 2014 లో ఓటు వేసాను ఇప్పుడు సిగ్గుపడుతున్నా. తుగ్లగ్ పాలన పుస్తకాలలో చదివా ఇప్పుడు ప్రజా భక్షణ జవాబు దారి పారదర్శకంత లేని రాజకీయ రాబందులు పాలన చూస్తున్న..
ప్రశ్నించండి వ్యవస్థను మారుద్దాం..జై భారత్.