YS Jagan Begins 200 Day of Praja Sankalpa Padayatra | Amalapuram | YSRCP Party Live telugu news

29

YS Jagan Begins 200 Day of Praja Sankalpa Padayatra | Amalapuram | YSRCP Party Live telugu news

YS Jagan Begins 200 Day of Praja Sankalpa Padayatra | Amalapuram | YSRCP Party Live telugu news

YS Jagan Begins 200 Day of Praja Sankalpa Padayatraనేటికి 200 రోజులు పూర్తి చేసుకున్న ప్రజాసంకల్పయాత్ర
నేటితో ప్రజాసంకల్పయాత్ర 200 రోజులకు చేరుకుంది. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా అమలాపురం నియోజకవర్గంలోని అమలాపురం మండలంలో పాదయాత్ర కొనసాగుతోంది.

మంగళవారంతో 199 రోజుల పాదయాత్ర పూర్తి చేసుకున్న జననేత జగన్ నేడు (బుధవారం) 200వ రోజు మైలురాయిని చేరుకున్నారు.

ఏ రోజు ఎక్కడ?..

  • ప్రజా సంకల్ప యాత్ర.. 2017, నవంబరు 6న వైఎస్సార్‌ జిల్లా ఇడుపులపాయలో ప్రారంభం అయింది.
  • 25వ రోజు యాత్ర గత డిసెంబరు 3న కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం, తుగ్గలి మండలం మదనాంతపురంలో మొదలై చెరువు తండా వరకు కొనసాగింది.
  • 50వ రోజు యాత్ర ఈ ఏడాది జనవరి 2న చిత్తూరు జిల్లా మదనపల్లి నియోజకవర్గంలోని ‘చిన్న తిప్ప సముద్రం’ (సీటీఎం) నుంచి మొదలై పీలేరు నియోజకవర్గంలోని జమ్ములవారిపల్లి వరకు సాగింది.
  • 75వ రోజు యాత్ర జనవరి 30న నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలోని సైదాపురం శివారు నుంచి కలిచేడు వరకు సాగింది.
  • 100వ రోజు యాత్ర ఫిబ్రవరి 28న ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం, పొదిలి మండలంలోని ఉప్పలపాడు నుంచి మొదలై సంతనూతలపాడు నియోజకవర్గంలోని చీమకుర్తి వరకు సాగింది.
  • 125వ రోజు యాత్ర మార్చి 31న గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం సరిపూడి నుంచి మొదలై వెలవర్తిపాడు, మేడికొండూరు, గుండ్లపాలెం క్రాస్‌ రోడ్స్‌ మీదుగా పేరేచర్ల వరకు సాగింది.
  • 150వ రోజు యాత్ర మే 1వ తేదీన కష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలోని పర్ణశాల శివారు శిబిరం నుంచి ప్రారంభమై చిట్టిగూడూరు, గూడూరు, రామరాజుపాలెం క్రాస్, సుల్తానగరం మీదుగా మచిలీపట్నం వరకు కొనసాగింది.
  • 175వ రోజు యాత్ర మే 29వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం శివారు నుంచి ప్రారంభమై తలతాడితిప్ప, మెంతేపూడిక్రాస్, బొప్పనపల్లి, మత్స్యపురి, సీతారామపురం క్రాస్‌ మీదుగా కొప్పర్రు వరకు కొనసాగింది.
  • 200వ రోజు యాత్ర బుధవారం తూర్పు గోదావరి జిల్లా అమలాపురం శివారు నుంచి ప్రారంభమైంది.

దేశ చరిత్రలో ఎప్పుడూ, ఎవరూ కనీవినీ ఎరగని విధంగా.. ఓ యువ నాయకుడు ఎండనకా.. వాననకా.. అలుపూసలుపూ లేకుండా.. 200 రోజులపాటు 2400 కిలోమీటర్లకుపైగా పాదయాత్ర చేస్తూ.. ప్రజల కష్టాలు వింటూ, వారి కన్నీళ్ళు తుడుస్తూ, ఆత్మీయంగా స్పశిస్తూ, పలకరిస్తూ.. ముందుకు సాగుతున్న ఏకైక నేత, , జననేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మాత్రమే.

ఏ నాయకుడూ, ఎప్పుడూ వెళ్లని మారుమూల గ్రామాల్లో, మార్గాల్లో సైతం జననేత అడుగులు వేస్తున్నారు. కొండలు, కోనలు, చిట్టడువుల మీదుగా ఆయన యాత్ర కొనసాగుతోంది. ఎంత కష్టం వచ్చినా, ఆరోగ్యం ఎలా ఉన్నా, ఆయన తన యాత్ర ఆపడం లేదు. రాష్ట్రం కోసం, రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు కోసం ఒక మహాయజ్ఞంలా ప్రజాసంకల్పయాత్రలో ముందుకు కదులుతున్నారు.

నిత్యం ప్రజలతో మమేకం అవుతూ, వారి బాధలు వింటూ, వారికి ఒక భరోసా ఇస్తూ.. వారిలో ఒకరిలా, ప్రతీ నిరుపేద కుటుంబానికి ఒక అన్నగా, ఒక పెద్ద కొడుకుగా నేనున్నానంటూ.. జగన్‌ మోహన్‌ రెడ్డి అడుగులు వేస్తున్నారు.